UA-35385725-1 UA-35385725-1

డిజిట‌ల్ చెల్లింపులు సుర‌క్షిత‌మేనా?

డిజిట‌ల్ చెల్లింపులు సుర‌క్షిత‌మేనా?

వేగవంతమైన, సౌకర్యవంతమైన మరియు సురక్షిత చెల్లింపుల  లావాదేవీల కోసం డిజిటల్‌గా వెళ్లండి

డిజిట‌ల్ చెల్లింపులు సుర‌క్షిత‌మేనా? : భారతదేశంలో ఇంటర్నెట్‌ వ్యాప్తి 61%కు పైగా ఉంది. ప్రపంచంలో అతిపెద్ద మరియు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధగా ఇండియా నిలువబోతుంది. పలు ప్రభుత్వ కార్యక్రమాలైనటువంటి డిజిటల్‌ ఇండియా మిషన్‌ మరియు నేషనల్‌ బయోమెట్రిక్‌ డిజిటల్‌  ఐడెంటిటీ ప్రోగ్రామ్‌ వంటివి భారతదేశపు విస్తృతస్ధాయి ప్రజల నడుమ విభజనను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. అందువల్ల, ఆర్‌బీఐ  నిర్వహిస్తున్న డిజిటల్‌ చెల్లింపుల అవగాహన వారోత్సవం సందర్భంగా నగదు లావాదేవీల కంటే డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వడానికి కొన్ని ముఖ్య కారణాలను చూద్దాం.

డిజిటల్‌ చెల్లింపులు వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం, అది జీవితానికి తీసుకువచ్చే సౌలభ్యం. తమ వెంట నగదు తీసుకువెళ్లగలిగిన అసౌకర్యం లేదా ఏటీఎం విత్‌డ్రాయల్స్‌ కోసం గంటల తరబడి నిరీక్షించవలసిన అవసరం వినియోగదారులకు ఉండదు. తద్వారా వారికి సౌకర్యమూ మెరుగుపడుతుంది. విభిన్న మార్గాలలో లభించే డిజిటల్‌ చెల్లింపులు మరింతగా బిల్లు చెల్లింపులను సౌకర్యవంతంగా మార్చడంతో పాటుగా ఈ–వాలెట్‌తో  ప్రజా రవాణా టిక్కెట్ల కొనుగోలు లేదా కొనుగోళ్ల కోసం ట్యాప్‌ అండ్‌  పే కార్డు వినియోగం వంటివి సౌకర్యం తీసుకువస్తున్నాయి. ఈ చెల్లింపులన్నీ కూడా సెకన్ల వ్యవధిలో చేయవచ్చు. అదనంగా, డిజిటల్‌ చెల్లింపులతో దొంగల భయం ఉండదు, నగదు వెంట తీసుకువెళ్లాలన్న సమస్య కూడా ఉండదు. డిజిటల్‌ చెల్లింపులన్నింటికీ  విస్తృత స్థాయిలో మోసాలను తగ్గించే చర్యలు అయినటువంటి అదనపు ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌ (ఏఎఫ్ఏ), వాస్తవ సమయంలో అలర్ట్స్‌ రావడం వల్ల  నగదు లావాదేవీలో పోలిస్తే ఇవి సురక్షిత పరిష్కారాలుగా నిలుస్తాయి.

సంప్రదాయ పద్ధతుల్లోని చెల్లింపులతో పోలిస్తే డిజిటల్‌ చెల్లింపులు అత్యంత వేగవంతమైన అవకాశాలు అందిస్తాయి. సమయం లేదంటే ప్రాంతపు అవరోధాలు దీనికి ఉండవు. ఓ వినియోగదారుడు ఏ సమయంలో అయినా ఎక్కడి నుంచైనా ప్రపంచ వ్యాప్తంగా చెల్లింపులు చేయవచ్చు. అంతేకాదు, దీనిలో బహుళ అంచెల భద్రతలు అయినటువంటి టోకెనైజేషన్‌, ఎన్‌క్రిప్షన్‌ మొదలైనవి పరిచయం చేసింది. డిజిటల్‌ చెల్లింపులు అత్యంత సురక్షితమైనవి మరియు చెల్లింపుల పరంగానూ భద్రతను అందిస్తాయి.

మహమ్మారి కారణంగా డిజిటల్‌ చెల్లింపుల స్వీకరణ గణనీయంగా పెరిగింది. ఈ మార్పు ఇప్పుడు  చిరు వ్యాపారులు, స్ధానిక షాపుల యజమానులు ప్రపంచంతో పాటుగా మారేందుకు మరియు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి కూడా  సహాయపడుతుంది. మరింత మంది  వ్యాపారులు డిజిటల్‌ చెల్లింపులను అంగీకరిస్తే, సమాజమంతటా దీని సానుకూల ఫలితాలు ప్రతిధ్వనిస్తాయి. (Story: డిజిట‌ల్ చెల్లింపులు సుర‌క్షిత‌మేనా?)

Are there Digital Payments safe?
Are there Digital Payments safe?

See Also: మెగాస్టార్ మేడే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1