ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన
వేగవంతం చేయాలి: ఆర్ డి ఓ శ్రీనివాసులు
న్యూస్ తెలుగు/ నేరేడుచర్ల : ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని హుజూర్ నగర్ ఆర్ డి ఓ శ్రీనివాసులు సూచించారు. ఆయన శనివారం నేరేడుచర్ల
తహసీల్దార్ కార్యాలయం నువిజిట్ చేసినా అనంతరం మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పోగ్రెస్ చాలా తక్కువగా ఉన్నది దరఖాస్తుల పరిశీలన చేసి తొందరగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే బి ఎల్ ఓలు ఇంటి ఇంటి స్థానిక సంస్థల ఓటర్ లిస్ట్ ప్రక్రియ రెండు రోజులల్లో పూర్తి చేయాలని కోరారు.
ఎంపిడిఓ సోమ సుందర్ రెడ్డి మాట్లాడుతు:
మండల వ్యాప్తంగా 19 గ్రామ పంచాయతీ ఉండగా 12 గ్రామాల వార్డుల స్థానిక సంస్థల ఓటర్ ప్రక్రియ పూర్తీ చేసినట్లు అలాగే ఇంకా 7 గ్రామాల ప్రక్రియ కొనసాగుతుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి,తహశీల్దార్ సురిగి సైదులు, డిప్యూటీ తహసీల్దార్ మౌనిక తదితరులు పాల్గొన్నారు (story : ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన)