కృష్ణుడు చెప్పిన భగవద్గీత అనుసరనీయం
న్యూస్‌తెలుగు/ విజయనగరం : సకల మానవాలికి భగవద్గీత ఎంతో అవసరం అని, దీన్ని శాస్త్ర బద్దంగా చెప్పేదే త్రైత సిద్ధాంత భగవద్గీత అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రబోధసేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక, విజయనగరం శాఖ ఆధ్వర్యంలో సోమవారం గురజాడ కళాభారతి లో శ్రీ ఆచార్య ప్రభోధానంద యోగీశ్వరుల ఆశీస్సులతో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆయన ఘనంగా ప్రారంబించారు. ఈ మేరకు అయన మాట్లాడుతూ, ఇందుత్వాన్ని
త్రైత సిద్ధాంతం రూపంలో ప్రజలకి చేరువ చేసేదే భగవద్గీత అని అన్నారు. ప్రతి ఒక్కరు శ్రీ కృష్ణుని బోధలు తెలుసుకోవాలని, అన్ని మతాల సారాంశం ఒకటే అని, అదే శ్రీ కృష్ణుని బోధ అని అన్నారు.. గీతా సారాంశం ప్రజలకి చేరువ చేయడం లో ఇందూ జ్ఞాన వేదిక పాత్ర చాలా గొప్పదని అన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొనడం చాలా అదృష్టం అని సంతోషం వ్యక్త పరిచారు.ఈ సంస్థ ఈ వేడుకలని ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తూ ప్రజలకి భగవద్గీత ని దగ్గర చేయడం అభినందించదగిన విషయం అన్నారు. ఈ ఉత్సవాలు ఈనెల 30 వరకు ఉంటాయని అదే రోజు ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘవర్మ, బాలల హక్కుల రాష్ట్ర కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ కేసలి అప్పారావు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి, ప్రబోధసేవా సమితి, ఇందూజ్ఞాన వేదిక అధ్యక్షులు వానపల్లి శంకర రావు,సమితి సభ్యులు నాయుడు, ప్రసాద్, సూరిబాబు, ఆదినారాయణ, జగన్నాధం, వంశీ, సీతంనాయుడు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు ..(story : కృష్ణుడు చెప్పిన భగవద్గీత అనుసరనీయం )