UA-35385725-1 UA-35385725-1

‘ఉరుకు పటేల’  ట్రైలర్ విడుదల..

‘ఉరుకు పటేల’  ట్రైలర్ విడుదల..

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా:
హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచెర్ల‌. తేజ‌స్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజర్, ‘ప‌ట్నం పిల్లా..’ .. ‘ఓరి మాయలోడా..’ సాంగ్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో సోమ‌వారం ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. హీరోకి పెళ్లి వ‌య‌సు వ‌చ్చినా పెళ్లి కావ‌టం లేద‌ని బాధ ఎక్కువ అవుతుంటుంది. అందుకు కార‌ణం.. త‌నేమీ చ‌దువుకోడు.. కానీ బాగా చ‌దువుకున్న పిల్ల‌నే పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. అత‌ని ఆశ‌ల‌కు త‌గ్గ‌ట్టే మ‌న అంద‌మైన హీరోయిన్ అత‌న్ని ప్రేమిస్తుంది. చాలా మంది చ‌దువుకున్న అమ్మాయిల‌కు న‌చ్చ‌ని హీరోని హీరోయిన్ మాత్రం ఎందుకు ప్రేమించిందా! అనేది చాలా మందిలో ఉండే ప్ర‌శ్న‌. కానీ.. క‌థ‌లో అస‌లు ట్విస్ట్ అదే. మ‌న హీరోయిన్‌లో మ‌రో కోణం బ‌య‌ట‌కు వ‌స్తుంది. దెబ్బ‌కు హీరో భ‌య‌ప‌డ‌తాడు.. ఏం చేయాలో తెలియ‌క పారిపోవాలనుకుంటాడు.. ఇంత‌కీ హీరోయిన్ ఏం చేసింది.. ఆమెను చూసి హీరో ఎందుకు భ‌య‌ప‌డ్డాడు.. చివ‌ర‌కు ఏమైంద‌నేది తెలుసుకోవాలంటే సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ కాబోతున్న సినిమాను చూడాల్సిందేనంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

న‌టీన‌టులు:

తేజ‌స్ కంచెర్ల‌, ఖుష్బూ చౌద‌రి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌:  లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్‌, ద‌ర్శ‌క‌త్వం:  వివేక్ రెడ్డి, నిర్మాత‌:  కంచెర్ల బాల భాను, సినిమాటోగ్ర‌పీ:  స‌న్నీ కూర‌పాటి, మ్యూజిక్‌:  ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, సౌండ్ డిజైన్‌:  ప్ర‌దీప్.జి, ఎడిట‌ర్‌:  శశాంక్ ఉప్పుటూరి, ఆర్ట్‌:  వివేక్ అన్నామ‌లై, కొరియోగ్ర‌ఫీ:  జీతూ మాస్ట‌ర్‌, ఫైట్స్‌:  రాబిన్ సుబ్బు, పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా. (Story : ‘ఉరుకు పటేల’  ట్రైలర్ విడుదల..)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1