మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పి నల్లమయ్య
న్యూస్‌తెలుగు/ విజయనగరం : రాష్ట్రవ్యాప్తంగా 24 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనిలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ కమీషనర్ గా పి నల్లమయ్య నియమతలయ్యారు. ప్రస్తుతం ఈయన గ్రేటర్ విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. ఈయనను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ షింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇంతవరకు కమిషనర్ గా పనిచేసిన ఎం మల్లయ్య నాయుడును తదుపరి ఆదేశాల వచ్చే వరకు డైరెక్ట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. (Story : మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పి నల్లమయ్య)