UA-35385725-1 UA-35385725-1

భావి తరాలకు డొక్కా సీతమ్మ గారి దాతృత్వం తెలియాలి

భావి తరాలకు డొక్కా సీతమ్మ గారి దాతృత్వం తెలియాలి

• మధ్యాహ్న భోజన పథకానికి అపర అన్నపూర్ణ పేరు సబబు
• ప్రభుత్వం నిర్వహించే కాంటీన్లను ఎన్టీఆర్ గారి పేరుతో కొనసాగించాలి
• ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రు ప్రతిపాదన

ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రారంభించే కాంటీన్లకు పేరు ఖరారు విషయంలో ఒక ఆసక్తికర చర్చ చోటు చేసుకొంది. వీటికి ఎన్టీఆర్ గారి పేరుతో అన్నా కాంటీన్లు అని కొనసాగించాలా, డొక్కా సీతమ్మ గారి పేరు కూడా జోడించాలా అనే చర్చ వచ్చింది. ఈ సందర్భంగా 2019 వరకూ ఉన్న విధంగా అన్నా కాంటీన్లు అని కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి పేరు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించిన క్రమంలో కాంటీన్లకు ఎన్టీఆర్ పేరును కొనసాగించవచ్చని ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లారు.
డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తే ప్రతి విద్యార్థికి సీతమ్మ గారి గొప్పదనం తెలుస్తుందని, పాఠశాల స్థాయిలో విశిష్ట వ్యక్తులు, దాతృత్వం కలిగినవారి పేర్లు మీద పథకాలు ఉండటం వల్ల భావితరాలకు మేలు కలుగుతుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తాను పాఠశాల దశలో ఉండగా డొక్కా సీతమ్మ గారి గురించి చదివిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. కంబాల కృష్ణమూర్తి గారు రాసిన అమృత వాక్కులు అనే సంకలనాన్ని మా నాన్నగారు ఇచ్చారు. అందులో డొక్కా సీతమ్మ గారి దాన గుణాన్ని, ఆకలి అన్న వారికి అర్థరాత్రి వేళ కూడా వండివార్చి పెట్టేవారనీ, అంతర్వేది దర్శనానికి బయలుదేరితే… దారిలో తన ఇంటికి భోజనానికి యాత్రికులు వస్తున్నారని తెలిసి దైవ దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వచ్చి ఆకలి తీర్చారని చదివాను. ఆ రోజు నుంచి డొక్కా సీతమ్మ గారి దాతృత్వ భావనలు గుర్తుకు వస్తూనే ఉంటాయని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు.
స్కూలు విద్యార్థులకు భోజనం అందించే పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు ఉండటం వల్ల భావి తరాలకు విలువలు అందించగలమన్నారు. అలాగే పేదలకు కిలో రూ.2 కు బియ్యం అందించే పథకం తీసుకువచ్చిన శ్రీ ఎన్టీఆర్ గారి పేరుతో అన్నా కాంటీన్లు నిర్వహణ సముచితమన్నారు. (Story : భావి తరాలకు డొక్కా సీతమ్మ గారి దాతృత్వం తెలియాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1