లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తప్పవు
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కరరావు
న్యూస్‌తెలుగు/ విజయనగరం టౌన్ : లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్ భాస్కరరావు అన్నారు మంగళవారం జిల్లా స్థాయి అడ్వజరి కమిటీ సమావేశము జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్. భాస్కర రావు అధ్యక్షతన గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ ప్రక్రియ చట్టం 1994 అమలుపై నియమించిన జిల్లా స్థాయి మరియు ఉప జిల్లా స్థాయి అడ్వయజరి కమిటీ సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ భాస్కర రావు మాట్లాడుతూ గర్భస్థ పిండ పరిస్థితి, వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు వినియోగించవలసిన యంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రభుత్వం నిర్దేశించిన చట్టాన్ని తప్పక అమలు చేస్తామని కమిటీ సబ్యులు తెలిపారు. ప్రాగ్రామ్ అధికారులకు స్కానింగ్ సెంటర్ లను విధిగా పర్యవేక్షించాలని, అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ రేగులేషన్ (ఏ ఆర్ టి) చట్టం -2021, సరోగసీ రేగులేషన్ చట్టం – 2021 ప్రకారం జిల్లాలోని ఫెర్టిలిటీ కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కోసం ఏఆర్టీ నేషనల్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచనలు ఇచ్చారుఈ కార్యక్రమం లో వ్యాది నిరోధక టీకా అధికారి , పి.సి.పి.ఎస్.డి.టి నోడల్ అడికారి డా. అచ్చుత కుమారి , ఉప జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా. ఎస్. సూర్యనారాయణ , డా. కె. గౌరీ శంకర్ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, డా. అరుణ శుభశ్రీ రావు , స్త్రీ వైద్య నిపుణులు ఘోషా ఆసుపత్రి, డా. ఆర్. సుజాతదేవి చిన్న పిల్లల వైద్య నిపుణులు, ఘోషా ఆసుపత్రి. శ్రీ కృష్ణ గారు నేచర్ ఎన్జీవో చిన్న తల్లి డెమో ఇతర ప్రోగ్రామ్ అధికారులు మరియు డెమో సెక్షన్ సభ్యులు పాల్గొన్నారు. (Story : లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తప్పవు)