ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేసే బడ్జెట్
జనసేన నేత గురాన అయ్యలు
న్యూస్‌తెలుగు/విజయనగరం :కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా గొప్పదని, అన్నివర్గాలకూ మేలు చేసేలా ఉందని జనసేన నేత గురాన అయ్యలు ప్రశంసించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామనే ప్రకటన కూడా శుభపరిణామం అన్నారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందన్నారు. (Story : ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేసే బడ్జెట్)