ఎడతెరిపి లేని వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పాత మట్టి మిద్దెలలో ఉండే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి :గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. మున్సిపాలిటీలలో నీరు నిల్వ ఉండే ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించి పారిశుద్ధ చర్యలు చేపట్టాలని, ఎత్తైన ప్రాంతాల నుంచి లోతట్టుకు వచ్చే వర్షపు నీటిని మురికి కలువలలోకి మళ్ళించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారు . మట్టిమిద్దెలల్లో శిథిలావస్థలో ఇళ్లల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ ఆవాసలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వైద్యాధికారులు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్లన్నారు. గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. (Story : ఎడతెరిపి లేని వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి)