పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక జడ్పీ హై స్కూల్ ఎన్.ఎస్.పి.కాలనీ లో పాఠశాల విద్యార్థులకు బాలల దినోత్సవం సందర్భంగా బహుమతులను నూజెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంగినేని రాధాకృష్ణమూర్తి (బాబు) అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. బాలబాలికలు చదువుతోపాటు ప్రతి ఒక్కరూ ఆటల్లో పాల్గొని శారీరకంగా మరియు మానసికంగా బాగా ఉండాలని అన్నారు. ఈ బహుమతులను ప్రతి సంవత్సరం పాఠశాలకు ఇస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సిహెచ్ వీరప్పయ్య, ఖమ్మంపాడు మాజీ సర్పంచ్ గంగినేని చంద్రశేఖర రావు, ములకలూరు మాజీ సర్పంచ్ వెంకట్రావు, నూజెండ్ల మండల మాజీ ఎం. పి. పి శ్రీనివాసరావు, నాగిరెడ్డి పల్లె రామయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(Story:పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం)

