Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సకలజనుల కార్తీక వన సమారాధన

సకలజనుల కార్తీక వన సమారాధన

సకలజనుల కార్తీక వన సమారాధన

న్యూస్ తెలుగు / వినుకొండ : అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో మంగళవారం సకలజనుల కార్తీక వన సమారాధన 11వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఘనంగా స్వామివారికి స్పటిక రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమం నందు తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషములకు పంచామృత మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ఆలయ మహిళా సేవకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ప్రతినిత్యం నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకొని సకలజనుల కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని కి వినుకొండ పట్టణ పుర ప్రముఖులు ఎక్స్ ఏజిపి సీనియర్ న్యాయవాది పొట్లూరు సైదారావు, నల్లబోతు రామకోటేశ్వరావు అతిధులుగా పాల్గొని ప్రత్యేక పూజలు అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. వినుకొండలో మునిపెన్నడలేని విధంగా ఆశ్రమ నిర్మాణ కార్యక్రమాలకు దాతలందరు సహకారంతో అద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న లక్ష్మీనరసింహస్వామి సేవకులకు వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాజుల మాల్యాద్రి, బద్దిక నరసింహారావు, హనుమంత సూరి, కాకుమాను రామారావు, పిచ్చయ్య, తారక్ రాము, వెంకటేశ్వర్లు, మహిళా సేవకులు ఏటుకూరి కృష్ణవేణి, పిడతల రమ, నాగలక్ష్మి, పత్తి భ్రమరాంబ, బుర్ర సుజాత, సరోజనమ్మ, తదితర మహిళా భక్త బృందం పాల్గొన్నారు. (Story:సకలజనుల కార్తీక వన సమారాధన)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!