Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌డ్వాక్రా సంఘాల సభ్యులకు వేగంగా సేవలు..

డ్వాక్రా సంఘాల సభ్యులకు వేగంగా సేవలు..

డ్వాక్రా సంఘాల సభ్యులకు వేగంగా సేవలు..

 మెప్మా ఆర్పీలకు ట్యాబులు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు

న్యూస్ తెలుగు / వినుకొండ : డ్వాక్రా సంఘంలోని సభ్యులకు సేవలు వేగవంతంగా అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అమలు చేయడం హర్షనీయమని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం వినుకొండ మునిసిపల్ కార్యాలయం లో కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన మెప్మా ఆర్పీలకు లాప్ టాప్ లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ మాట్లాడుతూ. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక స్వాలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళా సంఘాల వివరాలను ఆన్లైన్లో పొందుపరచుటకు ప్రభుత్వం ట్యాబులు అందజేసింది అన్నారు. గతంలో మహిళలు అడుగు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల నేడు మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఘనతేనన్నారు. ఆర్పీలు గతంలో అన్ని మాన్యువల్ గా పనిచేసేవారిని, ఇప్పుడు టాబ్స్ ద్వారా డిజిటలైజేషన్ అవుతుందని, డ్వాక్రా సంఘాల సభ్యుల పని వేగంగా సులభంగా మారుతుందన్నారు. ప్రతి ఇంట్లో ఒక్క ఎంటర్ ప్రేన్యూరో ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఆర్పీలకు లాప్టాప్ పంపిణీ ద్వారా డ్వాక్రా సంఘాల్లోనూ టెక్నాలజీ వినియోగం మరింత పెరుగుతుందని చెప్పారు. ఆర్పీలు ల్యాప్టాప్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story:డ్వాక్రా సంఘాల సభ్యులకు వేగంగా సేవలు..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!