పాత ఇనుప షాపుల యజమానులకు అవగాహన
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో, వినుకొండ పురపాలక సంఘం పరిధిలో ఉన్న, పాత ఇనుప షాపుల యజమానులకు, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో, అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. పాత ఇనుప సామాన్లు దుకాణాలు నివాసాల ప్రాంతాల మధ్యలో ఉండకుండా, అగ్నిమాపక మరియు మున్సిపల్ శాఖ అలాగే పోలీసు శాఖ వారి అనుమతులు సూచనలతో షాపుల నిర్వహణ చేసుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రమాదాల సమయంలో షాపులో ఉండవలసిన సేఫ్టీ ఫైర్ సిలిండర్ లను అదేవిధంగా సుమారు 1000 లీటర్ల ట్యాంక్, ఇసుక బస్తాలు, షాపుకు నలుమూలల దారి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. షాపులలో పనిచేసే కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఉండేలా చూడాలని కోరారు. కార్మిక శాఖ నుంచి తప్పకుండా సర్టిఫికెట్స్ పొంది ఉండాలని చెప్పారు. షాపులో ఉన్న సామాన్లను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సానిటరీ ఇన్స్పెక్టర్ షేక్.ఇస్మాయిల్, సెక్రటరీలు, మేస్తిరులు, షాపుల నిర్వాహకులు పాల్గొన్నారు. (Story:పాత ఇనుప షాపుల యజమానులకు అవగాహన)