కౌన్సిలర్లకు గౌరవ వేతనం ఇవ్వకుండా అవమానిస్తారా..
అజెండా కాపీలు ముందు రోజు ఎందుకు పంపరు..
పదవి కాలం దగ్గర పడుతుంది.. వార్డుల్లో పనులు చేయరా..
కౌన్సిలర్ల ఆగ్రహం
న్యూస్ తెలుగు / వినుకొండ : అన్ని అత్యవసర సమావేశాలే, సాధారణ సమావేశాలు ఉండవా, అజెండా కాపీలు ముందు రోజు ఎందుకు పంపరు, కొన్ని మాసాలుగా కౌన్సిలర్లకు గౌరవ వేతనం ఇవ్వకుండా అవమానిస్తున్నారంటూ వైకాపాకు చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్లు బేతం గాబ్రియేలు, టి.రాజేష్ ఖన్నా, కౌన్సిలర్లు ఎం
ఎస్. కె.భాషా, గంట కాలేషా మరి కొంతమంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి పై మున్సిపల్ కమిషనర్ ఎం. చంద్రబోస్ పై ధ్వజమెత్తారు. శనివారం మున్సిపల్ సమావేశ మందిరంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన జరిగింది. అజెండాలోని అంశాలు చదవడం ప్రారంభించగా, పై కౌన్సిలర్లు అడ్డు తగిలి ప్రతిసారి అత్యవసర సమావేశాలే అంటూ చేతులు దులుపుకుంటున్నారని సాధారణ సమావేశాలు ఎందుకు జరపరంటూ, అజండా కాపీలు ముందు రోజు ఎందుకు పంపరు అంటూ సమావేశాన్ని గందరగోళపరిచారు. దీంతో మున్సిపల్ చైర్మన్ జోక్యం చేసుకొని కొన్ని లోటు పాట్లు జరిగాయంటూ, ఇకనుంచి అలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక కొన్ని మాసాలుగా కౌన్సిలర్లకు గౌరవ వేతనం ఇవ్వటం లేదని, ఇక తమ పదవీకాలం ఎనిమిది మాసాలు మాత్రమే ఉందని, ఇకనుంచి అయినా గౌరవ వేతనం ఇచ్చి గౌరవిస్తారా, లేక అవమానిస్తారా అంటూ, అధికారులపై ధ్వజమెత్తారు. కమిషనర్ చంద్రబోస్ జోక్యం చేసుకొని కౌన్సిలర్లను గౌరవిస్తాం, గౌర వేతనం ఇస్తామని బదులిచ్చారు. కనీసం ఎమ్మెల్యే వీధిలో కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదని, కొన్ని మిగిలిపోయాయని ఎప్పుడు చేస్తారంటూ కౌన్సిలర్ బ్రహ్మయ్య అధికారులను ప్రశ్నించారు.. పట్టణంలో డ్రైనేజీ నిర్మాణాలతో షాపుల ముందు తవ్వుకుంటూ పోతున్నారని, డ్రైనేజీ నిర్మాణాలు ఎప్పటికీ పూర్తి చేస్తారు. షాపుల వారిని తికమక పెడుతున్నారంటూ పలువురు కౌన్సిలర్లు చైర్మన్ దస్తగిరిని ప్రశ్నించారు. దీంతో ఆయన మాట్లాడుతూ. ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి హద్దులు పెడతామని, హద్దులు అతిక్రమిస్తే మరల ఆక్రమణ తొలగిస్తామని హెచ్చరించారు. కాగా అజెండాలో 22 అంశాలు మాత్రమే పొందుపరచి సమావేశం జరుగుతున్న సమయంలో మరో మూడు అంశాలు తీసుకురావడం ఏంటని కౌన్సిలర్లు ప్రశ్నించారు. మొత్తం 25 అంశాలు ఉండగా 24వ అంశం అది కోర్టులో ఉంది కదా ఎలా తీర్మానిస్తారు అంటూ కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఎట్టకేలకు అజెండాలోని 25 అంశాలు కౌన్సిల్ ఆమోదించినట్లు చైర్మన్ దస్తగిరి ప్రకటించారు. (Story:కౌన్సిలర్లకు గౌరవ వేతనం ఇవ్వకుండా అవమానిస్తారా..)

