Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

న్యూస్ తెలుగు / వినుకొండ : విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో బుధవారం సంఘ కార్యాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కీ.శే. ఆవ్వారు రంగయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు అవ్వారు కోటేశ్వరరావు ధర్మపత్ని పద్మావతి కుమార్తె అవ్వారు లక్ష్మీ శైలజ లు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. గత 10 సంవత్సరాలుగా విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా బుధవారం 87వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విశ్రాంత ఉద్యోగుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుందని, ఇదేవిధంగా వారి సహకారంతో మునుముందు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జి నాగేంద్రుడు, బిపిఎస్ సుందర్రావు, ఏ రామలింగేశ్వరరావు, పి నారాయణ రావు, వై వి సుబ్బయ్య శర్మ, రాఘవయ్య, ఆది రాములు ,ఎం.వి శర్మ, ఎస్ ఎస్ ఎన్ శాస్త్రి, జి వెంకటస్వామి, శంకర్రావు, దీక్షితులు, భోగ జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. (Story:విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!