యువత స్వయం ఉపాధితో ఎదగాలి
టీ,టిఫిన్ సెంటర్ ప్రారంభించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : 29వ వార్డ్( న్యూబస్ స్టాండ్)ప్రక్కన దావాజిపల్లికి చెందిన సుమిత్రశ్రీశైలం నాయుడు “సంజన టీ టిఫిన్ సెంటర్ నూతనంగా ప్రారంభించారు.వారి ఆహ్వానం మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. స్వయం ఉపాధిని ఎంచుకున్న దంపతులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సన్మానించి అభినందించారు. సుమిత్ర శ్రీశైలం నాయుడు మాట్లాడుతూ మా పిలుపు మేరకు మా టీ స్టాల్ ప్రారంభించి మాకు దీవెనలు అందజేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పలుస.రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,ప్రేమ్ నాథ్ రెడ్డి,పెద్దముక్కుల.రవి, విజయ్, చిన్నారెడ్డి,కావాలి.రవి,జోహేబ్బ్ హుస్సేన్,స్టార్.రహీమ్, ఆరీఫ్, నీల స్వామి,రిటైర్డ్ ఆర్.టి.సి ఉద్యోగులు ఉన్నారు. (Story: యువత స్వయం ఉపాధితో ఎదగాలి)