పల్నాడు జిల్లా ఏఐవైఎఫ్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా మహంకాళి సుబ్బారావు,షేక్ సుభాని ఎన్నిక
న్యూస్ తెలుగు/వినుకొండ : పల్నాడు జిల్లా అఖిలభారత యువజన సమాఖ్య ( ఏఐవైఎఫ్ ) ప్రధమ మహాసభలు వినుకొండ పట్టణంలో బుధవారం శివయ్య స్తూపం సెంటర్ లో బహిరంగ జరిగిన అనంతరం, స్థానిక సీపీఐ కార్యాలయంలో ప్రతినిధుల సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, జిల్లా అధ్యక్షులుగా మహంకాళి సుబ్బారావు, కార్యదర్శిగా షేక్ సుభాని లతో పాటు తొమ్మిది మంది సభ్యులతో జిల్లా కమిటీని, జిల్లా కౌన్సిల్ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని సుబ్బారావు, సుభాని లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జిల్లాలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులను సమీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నిరుద్యోగుల పక్షాన ఏఐవైఎఫ్ గా పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. పల్నాడు జిల్లాలో నూతన పరిశ్రమలు నిర్మించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, జిల్లా సమక్రాభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా నర్రా రంగస్వామి ప్రత్తిపాటి నాగరాజు, యం.నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శులుగా కే మల్లికార్జున్, మర్రి వేముల మరియదాసు, కోశాధికారిగా రోడ్డ అంజిరెడ్డి లను ఎన్నుకోవడం జరిగింది.(Story : పల్నాడు జిల్లా ఏఐవైఎఫ్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా మహంకాళి సుబ్బారావు,షేక్ సుభాని ఎన్నిక )