ఈనెల 25నటిటిడి ఆధ్వర్యంలో వెంకటేశ్వర భక్తి చైతన్య యాత్ర ప్రోగ్రామింగ్ అధికారి జె శ్యాం సుందరం
న్యూస్‌తెలుగు/ విజయనగరం : ఈనెల 25న తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వెంకటేశ్వర భక్తి చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామింగ్ అధికారి జె శ్యాం సుందరం తెలిపారు. బుధవారం వీటికి సంబంధించిన కరపత్రాలను, ఫ్లెక్సీ బోర్డులను స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25న శ్రీ వెంకటేశ్వర భక్తి చైతన్య యాత్ర టిటిడి కళ్యాణ మండపం నుండి పైడితల్లి అమ్మవారి దేవాలయం వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాత్ర కార్యక్రమంలో భజనలు,కోలాటాలు, తప్పుడు గుళ్ళు తదితర సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కావున జిల్లా వ్యాప్తంగా ఉండే భక్తులంతా ఈ కార్యక్రమానికి విచ్చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో టీటీడీ కళ్యాణ మండపం అధినేత ఎన్ వెంకటపతి రాజు, అమ్మ నాన్న సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు జి తిరుపతిరావు, పూర్వపు ధార్మిక సలహా మండలి ఉపాధ్యక్షులు బి గౌరీ నరసింహ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. (Story : ఈనెల 25నటిటిడి ఆధ్వర్యంలో వెంకటేశ్వర భక్తి చైతన్య యాత్ర ప్రోగ్రామింగ్ అధికారి జె శ్యాం సుందరం)