సైకాలజిస్ట్ డా. ఎన్.వీ.స్. సూర్యనారాయణ కు ఇన్స్పా లీడర్షిప్ అవార్డు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : ప్రముఖ మానసిక నిపుణుడు, విద్యావేత్త,మొటివేషనల్ స్పీకర్ డా. ఎన్.వి.స్.సూర్యనారాయణ కు సైకాలజీ రంగంలో చేసిన విస్తృత సేవలకు, వేలాది విద్యార్థులను వారి లక్ష్య సాధించేందుకు ప్రేరణ ఇచ్చినందుకు ఇండియన్ స్కూల్ సైకాలజీ అసోసియేషన్ (ఇన్స్పా ) లీడర్షిప్ అవార్డు కి ఎంపిక చేసింది. ఈమేరకు ఇండియన్ స్కూల్ సైకాలజీ అసోసియేషన్ ఇన్స్పా జాతీయ అద్యక్షుడు, పుదుచ్చేరి విశ్వవిద్యాలయం యు జి సి -ఎం ఎం టి టి సి డైరెక్టర్ ప్రొ. పంచ్ రామలింగం ప్రకటించారు.ఈ అవార్డు ను “హిప్నోసిస్ ఎక్రాస్ లైఫ్ స్పాన్ : ప్రమోషన్, ప్రివెన్షన్ అండ్ ఇంటర్వెన్షన్“ అనే సంశయం పై ఈ నెల 24-25 తేదీలలో పుదుచ్చేరి విశ్వవిద్యాలయం, పుదుచ్చేరి జరిగే ‘రెండవ ఏవోహేచ్ ఇన్ స్పా అంతర్జాతీయ సదస్సు’ ప్రారంభ సమావేశంలో పొండిచేరి ప్రజా సమాచార , ప్రసార శాఖ రాష్ట్ర మంత్రి డా. ఎల్. మురుగన్ చేతుల మీదుగా డా. సూర్యనారాయణ కి ఇవ్వనున్నారని ఆయన తెలిపారు.
సైకాలజీ రంగం లో ఎంతో జాతీయ స్తాయిలో ఇచ్చే పర్యటిస్తాత్మకమైన ఈ లీడర్షిప్ అవార్డు తనకు లభించినందుకు ఎంతో గర్వంగా ఉందని తాను 25 సంవత్సరాలుగా సైకాలజీ రంగం లో చేస్తున్న సేవలును గుర్తించి ఈ అవార్డు తనకు లభించిందని, ఈ అవార్డు తనపై మరింత భాద్యత ను పెంచిందని తెలిపారు. డా.సూర్యనారాయణ కు అవార్డు వచ్చినందుకు సీటీయూ వైస్ చాన్సలర్ ప్రొ.తేజస్వి కట్టిమని, రిజిస్ట్రార్ ప్రొ.తంత్రవాహి శ్రీనివాసన్, కంట్రోలర్ ఆఫ్ ఎక్సామినేషన్ ప్రో.ఎస్.బి.కివాడే, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ పూర్వ కులపతులు ప్రొ. ముర్రు ముత్యాలనాయుడు, ప్రొ. మొక్క జగన్నాధ రావు, ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయ పూర్వ వీసీ ప్రొ. రాజేంద్ర ప్రసాద్ తదితరులు అభినందించారు. (Story : సైకాలజిస్ట్ డా. ఎన్.వీ.స్. సూర్యనారాయణ కు ఇన్స్పా లీడర్షిప్ అవార్డు)