ప్రజలు సుభిక్షంగా ఉండాలి
న్యూస్ తెలుగు/సాలూరు : రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నానని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సాలూరు పట్టణంలో వేంచేసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాజన్న దొర దంపతులు సామాన్య భక్తుల వలె క్యూలైన్ లో ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ చార్యులు, ఆలయ ధర్మకర్త వంగపాడు రాజేంద్రప్రసాద్ లు ఈ దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి అనే పర్వదినం చాలా ముఖ్యమైన రోజు అని, రాష్ట్రం మరియు ప్రపంచం లో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని అన్నారు. రైతులకు మంచి పంటలు పండాలని దేవుని కోరుకున్ననని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు కౌన్సిలర్ గిరి రఘు, ఆలయ ధర్మకర్త సభ్యులు టెక్కలి ధర్మ రావు, నాయకులు మేడిశెట్టి అప్పలనాయుడు మాదిరెడ్డి మధుసూదన్ రావు, రావాడ భాస్కర్ రావు మాస్టారు పాల్గొన్నారు.(Story : ప్రజలు సుభిక్షంగా ఉండాలి )