నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు..
మున్సిపల్ కమిషనర్..
న్యూస్ తెలుగు/ వినుకొండ : నీటి కాలుష్యాన్ని తగ్గించడంలో మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో పౌరులకు సమతుల్యమైన ప్రకృతిని అందించడంలో ముందుండే
వినుకొండ మున్సిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ఇటీవల స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ నిధులతో శ్రీకృష్ణ ఎన్విరో ఇంజనీర్ సంస్థ ద్వారా నిర్మించబడుతున్న మురుగునీటి శుద్ధి కర్మాగార(ఎస్టీపీ)నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. మురుగు నీటి నుండి కలుషితాలు తొలగించడానికి, నీటిని పునర్వినియోగానికి, సురక్షితంగా చేయడానికి ఎస్టీపీలు చాలా అవసరమని కమిషనర్ ఉద్ఘాటించారు . నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించడంలో, జలచరాలను రక్షించడంలో మరియు నీటి వనరుల మొత్తం నాణ్యతను కాపాడుకోవడంలో ఎస్టీపీల ప్రయోజనాలను కూడా ఆయన చర్చించారు. పట్టణంలో రెండు ఎస్టీపీ ప్లాంట్లు ఒకటి 5.7 ఎంఎల్డీతో ముట్లగుంట కాలనీ వద్ద రెండోది 5.5 ఎంఎల్డీతో ఎన్ ఆర్ టి రోడ్ నిర్మలా స్కూల్ చెక్ వాగు వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు, వీటిని ఏప్రిల్ లేదా మే నెల చివరి నాటికి పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ పర్యావరణ హితాభివృద్ధి పనులకు ప్రోత్సాహం అందిస్తున్న చీఫ్ విప్ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులుకు కమీషనర్ మరోమారు కృతజ్ఞతలు తెలిపారు.. (Story :నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు..)