సాలూరు గవర్నమెంట్ డిగ్రీ & పీజీ కాలేజీలో
మెగా జాబ్ మేళ
న్యూస్ తెలుగు /సాలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఆదివారం సాలూరు లోని స్థానిక గవర్నమెంట్ డిగ్రీ & పీజీ కాలేజీ, సాలూరు ఆవరణంలో సంకల్ప మెగా జాబ్ మేళ* నిర్వహించటం జరిగిందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మాత్యులుశాఖ గుమ్మడి సంధ్యారాణి అన్నారు .ఈ మెగా జాబ్ మేళ కి 25 కంపెనీ ప్రతినిధులు హాజరయ్యాయని తెలిపారు.ఈ రోజు జరిగిన ఈ జాబు డ్రైవ్ కు 465 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా అందులో 111 మంది 25 కంపెనీలలో ఎంపిక కావడం జరిగిందని జిల్లా నైపుణ్యాబిృద్ధి అధికారి కె సాయి కృష్ణ చైతన్య అన్నారు.సాలూరు గవ్నమెంట్ డిగ్రీ & పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ మతి డా|| కె ఉషశ్రీ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి సహకారంతో మరిన్ని నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. ఇలాంటి జాబ్ మేళలు సాలూరు నియోజకవర్గ యువత ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సాయి కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలని నిరుద్యోగా యువత అందిపుచ్చుకుని ఉన్నతా శిఖరాలు అదిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ ప్రజా ప్రతినిధులు, నైపుణ్యాభివృద్ధి సిబ్బంది, డిగ్రీ కళాశాల సిబ్బంది మరియు సీడాఫ్ సిబ్బంది హాజరయ్యారు. (Story : సాలూరు గవర్నమెంట్ డిగ్రీ & పీజీ కాలేజీ, లో మెగా జాబ్ మేళ)