సపక్ తక్రా జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థులు
న్యూస్‌తెలుగు/విజయనగరం :
డెసెంబర్ 20 నుండి 26వ తేదీ వరకు కేరళలో జరగుతున్న 27వ జాతీయ స్థాయి స సబ్ జూనియర్ బాలికల పోటీలకు కె.జి.బి.వి గంట్యాడ పాఠశాలలో చదువుతున్న కుమ్మరి అశ్విని (9వతరగతి), గండిమాని పవిత్ర (9వ తరగతి) విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి ఈనెల 15 వనుండి 19వ తేదీ వరకుశిబిరం ఉరవకొండ లో శిక్షణ నిర్వహిస్తారు. వీరిని ఒలంపిక్ అద్యక్ష కార్యదర్శులు గురాన అయ్యలు, సీ, హెచ్ వేణుగోపాలరావులు , సపక్ తక్రా సెక్రటరీ ఎంటి రాజేష్, సైక్లింగ్ అధ్యక్షులు ఎం.ఎస్ .ఎన్ . రాజు, పి.ఇ.టి. పి.భవాని,పి. డి. సీత అభినందిం చారు. పతకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. (Story :సపక్ తక్రా జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థులు.)