ఏడుగురాళ్లపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులు
న్యూస్‌తెలుగు/ ఏడుగురాళ్లపల్లి : ఈ రోజు అనగా తేదీ. 18.12.2024 వ తేదీన ఏడుగురాళ్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన కాటుకపల్లి , ఏడుగురాళ్లపల్లి , మద్దిగూడెం గ్రామములలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగినది. ఈ గ్రామ సభకు రెవిన్యూ సదస్సుల స్పెషల్ ఆఫీషర్ శ్రీమతి కె.సుజాత గారు మరియు తహసీల్దార్ యస్. చిరంజీవి బాబు, ఆర్. ఐ విగ్నేష్ మండల సర్వేయర్ గోవిందరాజు, గ్రామ రెవిన్యూ అధికారి సిహెచ్ మోహన్, గ్రామ సర్వేయర్లు మరియు మెడికల్ డిపార్ట్మెంట్ కిషోర్ కుమార్ ఒప్తలమిక్ ఆఫీసర్ మరియు ANMs లక్మి, స్వరూపా రాణీ సిబ్బంది గ్రామ సభలుకు హాజరు అయ్యినారు.
ఇందులో భూమి సంబంధిత సమష్యల అనగా, ఆన్లైన్ నమోదు కొరకు, పట్టా మార్పుల కొరకు, అసైన్ మెంట్ పట్టాలు కొరకు, భూమి సర్వే కొరకు, విస్తీర్ణం తప్పులు, కొత్తగా పాస్ పుస్తకం కొరకు ROFR పట్టాలు కొరకు దరఖాస్తులు తీసుకోవటం జరిగినది, రెవిన్యూ దరఖాస్తులు. 63 వచ్చాయి మెడికల్ సంబంధించి 41 మంది చెకప్ చేయించుకున్నారు. (Story : ఏడుగురాళ్లపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులు )