సత్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో యన్ సి సి క్యాడేట్స్ తో ఆర్మీ పతాక దినోత్సవ ఫండ్ కలెక్షన్
న్యూస్ తెలుగు/విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం కళాశాలలో ఆర్మీ పతాక దినోత్సవ సందర్బంగా యన్ సి సి క్యాడట్స్ ఫండ్ కలెక్షన్ చేయటం జరిగింది. కళాశాల యాజమాన్యం, వివిధ విభాగాదిపతులు , స్టాఫ్, స్టూడెంట్స్ సహాయానిదికి తమ వంతు విరాళాన్ని అందించారు
కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ దేశరక్షణ కు కృషి చేసిన సైనిక దళాలకు విరాళాలు సేకరించటం నేటి యువత భాద్యత అని కొనియాడారు.సీతం ప్రిన్సిపాల్ డాక్టర్ డి వి రామమూర్తి మాట్లాడుతూ ఆర్మీ పతాక నిధికి ప్రతి సంవత్సరం తమ వంతు సహాయం యన్ సి సి క్యాడట్స్ తో చేయించి జిల్లా సైనిక ఆఫీస్ కి అందిచటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సత్య ప్రిన్సిపాల్ డాక్టర్ యమ్ సాయిదేవమని మాట్లాడుతూ దేశ రక్షణలో భాగంగా తమ వంతు విరాళాలు అందచేస్తున్న అందరికి కృతజ్ఞతలు చెప్పారు.ఈ కార్యక్రమం లో కళాశాలాల ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు యన్ సి సి ఆఫీసర్స్ కెప్టెన్ సత్యవేణి, లెఫ్టినెంట్ వరలక్ష్మి, లెఫ్టినెంట్ ప్రశాంత్, కె సత్యనారాయణ, యన్ సి సి క్యాడట్స్ పాల్గొన్నారు.(Story : సత్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో యన్ సి సి క్యాడేట్స్ తో ఆర్మీ పతాక దినోత్సవ ఫండ్ కలెక్షన్)