సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల న్యాయమైన కోరికలను తీర్చాలి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు తమ డిమాండ్స్ నేరవేర్చాలని చేస్తున్న రిలే నిరాహారదీక్షల శిబిరాన్నిమాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించి ప్రసంగించారు. భావితరాలకు బంగారు బాటలు వేసే విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కనీస ఉద్యోగ భద్రత లేకుండా జీవితములో అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని అన్నారు. దాదాపు 19600మంది ఉద్యోగులు పాఠశాల విద్యా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వారి న్యాయమైన డిమాండ్స్ నేరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిరంజన్ రెడ్డి తో మాట్లాడుతూ మాపై ప్రేమతో శిబిరాన్ని సందర్శించి మాకు సంఘీభావం తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.తమ న్యాయమైన డిమాండ్స్. సమగ్ర శిక్షా ఉద్యోగులందరనీ రెగ్యులర్ చేయాలని అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వాలని, ప్రతి ఉద్యోగికి జీవిత భీమా 20లక్షల సౌకర్యం కల్పించాలని,ఆరోగ్య భీమా 10లక్షలు ఇవ్వాలని, S S A ఉద్యోగులకు పదవి విరమణ సందర్భంగా బెనిఫిట్స్ క్రింద 20లక్షలు ఇవ్వాలని ప్రభుత్వ మరియు విద్యాశాఖలో వెయిటేజి ఇవ్వాలని, P T I లకు 12నెలల జీతం ఇవ్వాలని చేస్తున్నా భవిష్యత్తు పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజప్తి చేశారు.(Story : సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల న్యాయమైన కోరికలను తీర్చాలి )