UA-35385725-1 UA-35385725-1

దీక్ష దివాస్ సాక్షిగా కె.సి.ఆర్ పోరాట స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాడాలి

దీక్ష దివాస్ సాక్షిగా కె.సి.ఆర్ పోరాట స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాడాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కె.టి.ఆర్ పిలుపు మేరకు దీక్షాదివాస్ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది.ఈ సమావేశములో మొదట తెలుగుతల్లికి పూలమాలలు సమర్పించి అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించి 2నిముషాలు మౌనం పాటించారు.అనంతరం కె.సి.ఆర్ కటౌట్ కు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉద్యమకాలం నాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ పలువురు ఉద్యమకారులు ప్రసంగించారు.ఈ సమావేశములో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చావు నోట్లో తలకాయపెట్టి తెలంగాణ సాధించారని అన్నారు.సుదీర్ఘ ఉద్యమములో కె.సి.ఆర్ చేపట్టిన దీక్షదివాస్ తెలంగాణ సకల జనులను ఏకం చేసిందని అన్నారు. దీక్షా దివాస్ మరోసారి తెలంగాణ వ్యతిరేక శక్తులను అరికట్టేందుకు చేయాల్సిన పరిస్థితి మరోసారి వచ్చిందని అన్నారు.14ఏండ్ల సుదీర్ఘ పోరాటం మరియు 10ఏండ్ల అధికారంలో కె.సి.ఆర్ సంక్షేమ పథకాలలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారని అన్నారు. అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేక కె.సి.ఆర్ గారిని నిత్యం తిడుతూ కె.సి.ఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు జేసిందని ప్రచారం చేస్తోందని వాస్తవంగా కె.సి.ఆర్ అధికారం కోల్పోయేనాటికి కేవలం 88వేల కోట్ల అప్పు మాత్రమే ఉన్నదని మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన 11నేలల్లో 85వేల కోట్ల అప్పూజేసిందని అన్నారు. కెసిఆర్ రాష్ట్ర సంపద సృష్టించి ప్రజల మనసు తెలుసుకొని అనేక సంక్షేమ పథకాలు రైతు బంధు,రైతు భీమా,రైతు రుణ మాఫీ వంటి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నూతన ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం రైతులకు 72వేల 815కోట్లు రైతు బంధు,రైతు భీమా 5వేల కోట్లు,55నుండి 60వేల కోట్లు కరెంట్ సబ్సిడీ ఇచ్చారు. మిషన్ భగీరథ 46వేల చెరువులను మరమ్మతు చేయడం జరిగింది,46వేల కోట్లతో ఇంటింటికీ మంచినీటి పథకం తీసుకొచ్చారు.దేశములో చిన్న రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు. రైతులను కె.సి.ఆర్ రాజును చేశాడు కాంగ్రెస్ మాత్రం రైతులకు ఇచ్చిన హామీలు రైతు బంధు,రైతు భీమా, రైతు రుణ మాఫీ, ధాన్యంపై బోనస్ ఎగ్గొట్టి నానా హరిగోస పెడుతుందని రైతులకు ఇచ్చే రైతు బంధు 7200కోట్లు వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చిందని దుయ్యబట్టారు. జూపల్లి గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఈ జిల్లాకు మంత్రిగా ఇంకొకరు క్యాబినెట్ ర్యాంక్ ఉన్న నాయకులు మిగిలిపోయిన పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేకపోతున్నారు కానీ కెసిఆర్ దయతో మంత్రి పదవి ఎలగబెట్టి పదవి పోయిన తర్వాత కూడా అన్ని వసతులు పొంది కె.సి.ఆర్ గారిని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు.పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే 2లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్లో ఆన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 4వేల కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి చేసింది కె.సి.ఆర్ అని అదేవిధంగా నార్లాపూర్, యేదుల,ఉద్దండపూర్ ఎత్తిపోతల పథకాలలో టన్నెల్స్,మోటార్స్ ఇచ్చి పూర్తి చేస్తే కాంగ్రెస్ వారికి సాగు నీరు ఇవ్వడానికి చేతకాలేదని అన్నారు. ప్రజలను అబద్ధాల మత్తులో ముంచి ఓట్లు వేయించుకొని ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు గాలికి వదిలేసింది అని అన్నారు. కెసిఆర్ 1లక్ష 63వేల ఉద్యోగాలు ఇచ్చారని మరో 46వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేస్తే కాంగ్రెస్ మేము ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.ఏడాదికి 3లక్షల కోట్ల అధాయముతో అప్పజెపితే కాంగ్రెస్ ప్రభుత్వం పాత 88వేల కోట్ల అప్పుతో కలుపుకుని 4లక్షల 26వేల కోట్ల అప్పు ప్రజల నెత్తిపై మోపిందని విమర్శించారు.రాష్ట్రములో 1027గురుకుల పాఠశాలలు కె.సి.ఆర్ గారు నాన్యవంతమైన విద్యను అందించినారని నేడు విద్యార్థులకు సౌకర్యాలు లేక ఫుడ్ పాయిజన్ బారినపడి మరణిస్తుంటే పట్టించుకొనే నాథుడే లేడని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా మరో దీక్షా దివాస్ స్ఫూర్తితో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర.జిల్లా నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : దీక్ష దివాస్ సాక్షిగా కె.సి.ఆర్ పోరాట స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాడాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1