వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ కు ఆహ్వానం
న్యూస్‌తెలుగు/వినుకొండ : క్రీస్తు ఆశీర్వాద సంఘము వారు నిర్వహించు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం 6 వ తేదీ సాయంత్రం 6 గంటలకు పల్నాడు రోడ్డు, కరెంట్ ఆఫీస్ ఎదురు బజారులో నిర్వహిస్తున్నట్లు సంఘ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా క్రీస్తు ఆశీర్వాద సంఘ కాపరి పాస్టర్ పి. ఫిలిప్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దైవ సేవకులు డా౹౹ బ్లెస్సి వెస్లీ ముఖ్య ప్రసంగీకులుగా విచ్చేసి క్రిస్మస్ సందేశం ఇస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలైనా క్రిస్మస్ పాటలు, కోలాటం, స్తుతి ఆరాధన వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చివరిగా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారిచే క్రిస్మస్ ప్రేమ విందు కలదు. కావున వినుకొండ చుట్టుప్రక్కల ప్రజలందరూ, దైవ సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి లిడియా ఫిలిప్ మరియు క్రీస్తు ఆశీర్వాద సంఘము సభ్యులు పాల్గొన్నారు. (Story : వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ కు ఆహ్వానం)