UA-35385725-1 UA-35385725-1

సరిహద్దుల్లో సైనికుల త్యాగాలతోనే నిశ్చింతగా ఉండగలుగుతున్నాం

సరిహద్దుల్లో సైనికుల త్యాగాలతోనే నిశ్చింతగా ఉండగలుగుతున్నాం

వినుకొండలో జవాన్ల సైకిల్ యాత్ర ప్రారంభించిన

ఎమ్మెల్యే జీవీ దంపతులు, మక్కెన

టెరిటోరియల్ ఆర్మీ సేవలు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా

జవాన్ల సైకిల్ యాత్ర

న్యూస్‌తెలుగు/ వినుకొండ : సరిహద్దుల్లో లక్షలమంది సైనికుల త్యాగాల ఫలితంగానే ఇక్కడ ప్రజలంతా గుండెలపై చేయి వేసుకుని నిశ్చింతగా ఉండగలుగుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అందుకే జై జావాన్ అంటూ నినదిస్తూ వారికి అత్యున్నత గౌరవం ఇస్తోన్న దేశం కూడా మనదేనంటూ సైన్యం సేవలను ఘనంగా కొనియాడారు. దేశంలో టెరిటోరియల్ ఆర్మీ సేవలకు 75 వసంతాల సందర్భంగా 30 మంది జవాన్లతో జులై 30న జమ్ముకశ్మీర్‌ సియాచిన్‌ లోని గ్లేసియర్ బేస్ క్యాంపు నుంచి మొదలై అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్ వరకు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర ఆదివారం వినుకొండ పట్టణానికి చేరుకుంది. ఈ క్రమంలో సోమవారం వినుకొండలో జవాన్లు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కారంపూడి రోడ్డులోని ఎన్నెస్పీ కాల్వ వద్ద జవాన్ల సైకిల్ యాత్రను జెండా ఊపి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, లీలావతి దంపతులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొన్న జవాన్లను ఎమ్మెల్యే జీవీ దంపతులు అభినందించారు. బస్టాండ్, స్తూపం సెంటర్‌ మీదుగా లయోల పాఠశాల వరకు ర్యాలీ సాగింది. జవాన్లతో పాటు సైకిల్ తొక్కి జీవీ ఆంజనేయులు ఉత్సాహపరిచారు. పట్టణంలో సాగిన యాత్రలో పెద్దఎత్తున విద్యార్థులు, యువత, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. యాత్రలో భాగంగా బృందం సభ్యులు లయోల పాఠశాలలో విద్యార్థులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. యాత్ర మార్గమధ్యలో వివిధ ప్రాంతాల్లో సుమారు 40 వేలమందికిపైగా మాజీ సైనికోద్యోగులు, వీర సైనికుల సతీమణులతో పాటు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువతతో సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడారు. భారతదేశ రక్షణ రంగంలో విశేష సేవలు అందిస్తూ 75ఏళ్ల వజ్రోత్సవ సందర్భానికి చేరువైన టెరిటోరియల్ సైన్యానికి మనస్ఫూర్తిగా శభాకాంక్షలు, శుభాభినందనలు తెలిపారు. 5,500 కిలో మీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన సైనిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దేశానికి భద్రత కల్పిస్తూ రక్షణలో భాగం పంచుకుంటూ నిత్యం దేశాన్ని కాపాడుతున్న సైనికుల సేవలు ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. ఈరోజున మనందరం సంతోషంగా ఉన్నామన్నా, దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నా, శత్రుదేశాలు, ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడుతున్న సైనికుల సేవలను ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ యాత్ర యువతలో స్ఫూర్తి నింపుతుందన్నారు. దేశ భద్రతలో మనం కూడా భాగస్వామ్యం కావాలని, విపత్తులు వచ్చినప్పుడు ఒకచెయ్యి వేసి ఆదుకోవాలనే సేవా భావాన్ని, స్ఫూర్తిని నింపుతుందన్నారు. 1949లో ప్రారంభం నుంచి నేటి వరకు దేశం ప్రతి ఆపద, ఆపత్కాకాలంలో టెరిటోరియల్ ఆర్మీ సేవలు అసమాన్యవైనవి, అమూల్యమైనవని కొనియాడారు. దేశంలో ఎక్కడా విపత్తులు తలెత్తిన ముందుండి సేవలు అందిస్తున్నారన్నారు. ఇటీవల వయనాడ్ వరదల నుంచి విజయవాడ వరదల్లో సహాయ చర్యల వరకు వారి సేవలను మనం చూశామన్నారు. బుడమేరు గండ్లు పూడ్చడంలో కూడా మద్రాస్ టెరిటోరియల్ ఆర్మీ మనకు సహాయంగా నిలిచిందని, అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. దేశ రక్షణతో పాటు విపత్తు సమయాల్లో స్వచ్ఛందంగా సేవలు అందించేలా యువత కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు టెరిటోరియల్ ఆర్మీ దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ యాత్ర వినుకొండకు రావడం సంతోషం అన్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భారతదేశం సురక్షితంగా ఉందంటే దానికి కారణం ఆర్మీ అని కొనియాడారు. అందులో భాగమైన టెరిటోరియల్ ఆర్మీ కూడా యుద్ధ సమయాల్లో గానీ విపత్తు సమయాల్లో అనేక సేవలు అందిస్తుందన్నారు. ఆర్మీ అందిస్తున్న సేవలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వినుకొండలో ఈ యాత్రను నిర్వహించిన జవాన్ల బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సైకిల్ యాత్ర బృందానికి నేతృత్వం వహిస్తోన్న మేజర్ రావత్ మాట్లాడుతూ లద్దాక్ మంచుకొండలు, ఎడారి ప్రాంతాలు సహా ఎన్నో దాటుకుంటూ ఈ సాహసభరితమైన యాత్ర సాగిస్తున్నామని తెలిపారు. తమ బృందాన్ని ఆహ్వానించడానికి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు, చిన్నారులు, ఎమ్మెల్యే జీవీ కి కృతజ్ఞతలు తెలిపారు. తమ యాత్ర పొడవుతా ఇక్కడి ఆతిథ్య జ్ఞాపకాలను గుర్తు పెట్టుకుంటాం అన్నారు. వినుకొండ పట్టణప్రజలు, ఎమ్మెల్యే జీవీ సహృదయత తమను ఎంతో కదలించిందని అన్నారు. వినుకొండ ప్రజల ప్రేమాభిమా నాలతో తమ మనస్సులు నిండిపోయాయన్నారు.ఆర్మీ జవాన్లు మాజ్ రావాత్, మజ్ అబ్జీత్,మొత్తం 46 మంది ఆర్మీ జవాన్లు మరియు ఎంఈఓ జఫ్రూలాఖా,జనసేన్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొణిజేటి నాగ శ్రీను రాయల్, ఎక్స్ ఆర్మీ జవాన్ బొల్లేపల్లి వెంకటరావు, బిజెపి నాయకులు మేడా రమేష్,గీతాంజలి విద్యాసంస్థల డైరెక్టర్ ఎండ్లూరి లక్ష్మణ్ కిషోర్,పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ అయిబి ఖాన్, లగడపాటి వెంకటరావు,పెమ్మసాని నాగేశ్వరరావు, వాసిరెడ్డి లింగ మూర్తి,రొడ్డా వీరాంజనేయరెడ్డి, సౌదగర్ జానీ భాష, గద్దే వీరా మస్తాన్ రావు, యరమాసు కోటేశ్వరరావు,పలు ప్రైవేట్ స్కూలు విద్యాసంస్థల డైరెక్టర్లు, పిటి మాస్టారులు, గాలి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : సరిహద్దుల్లో సైనికుల త్యాగాలతోనే నిశ్చింతగా ఉండగలుగుతున్నాం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1