నిరుపేద వికలాంగురాలికి రావుల చేయూత
న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలంలోని యాపర్ల గ్రామానికి చెందిన మాల మహేశ్వరికి మాజీ పార్లమెంట్ సభ్యులు వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం తో గురువారం కుట్టు మిషన్ ను అందజేశారు. వివరాల్లోకి వెళితే యాపర్ల గ్రామానికి చెందిన మాల మహేశ్వరికి గ్రహణమొర్రి చెవులు సరిగ్గా వినపడవు, అదేక్రమంలో మాటలు సరిగ్గా రావు. తన పెన్షన్ డబ్బులలో నెలకు వేయి రూపాయలు ఇస్తామని కుట్టుమిషను ఇప్పించమని స్థానికంగా ఉన్న ఓ పాత్రికేయుడిని అడిగింది. ఆ పాత్రికేయుడు నీ డబ్బులు ఏమొద్దులే అమ్మ అని విషయం తెరాస యువనాయకుడు వడ్డె రమేష్ దృష్టికి తీసుకొచ్చారు.తను మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందించారు. కష్టకాలం లో ఆదుకునేవారే నిజమైన నాయకులు అంటూ రావుల చంద్రశేఖర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.యాపర్ల మాజీ సర్పంచ్ ఆనంద్, అడ్వకేట్ కిషోర్ కుమార్ రెడ్డి లు కుట్టుమిషన్ ను మహేశ్వరికి అందించారు. ఈ కార్యక్రమంలో మద్దిలేటి, మునిస్వామి, రామకృష్ణ, గోఖారి, రవిగౌడ్, అంజి, బాలకృష్ణ, రాముడు తదితరులు పాల్గొన్నారు.(Story:నిరుపేద వికలాంగురాలికి రావుల చేయూత)