దీగ్రస్ లో ప్రచార హోరు
బ్రహ్మరథం పట్టిన నేర్ ప్రాంత ప్రజలు
మాణిక్ రావు ఠాక్రే గారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న నేతలు
న్యూస్ తెలుగు / వనపర్తి : మహారాష్ట్ర రాష్ట్రంలోని దీగ్రస్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. శనివారం స్థానిక MP సంజయ్ దేశ్ముక్, పవన్ జైష్వాలతో పాటు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డిలు నియోజకవర్గంలోని నేర్ లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందని గౌరవ శ్రీ మాణిక్ రావు ఠాక్రే గారి విజయాన్ని ఎవరు ఆపలేరనీ వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి దీగ్రస్ నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని, అలయన్స్ పార్టీ అభ్యర్థి అయిన మాణిక్రావు ఠాక్రే అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం లో స్థానిక అలయన్స్ పార్టీల పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు (Story : దీగ్రస్ లో ప్రచార హోరు)