చిగిచెర్ల గ్రామంలో పొలాల పరిశీలన
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సహాయకులు సనావుల్లా, సహాయ వ్యవసాయ సంచాలకులు ధర్మవరం కృష్ణయ్య ,మండల వ్యవసాయ అధికారితో కలిసి చిగిచెర్ల గ్రామంలో రైతుల పొలాలు పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రాఘవరెడ్డి చెందిన కందిపొలం పరిశీలించి చీడ పీడలు ఉనికిని పరిశీలించడం జరిగింది. అనంతరం అధికారులు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కంది లో కాయ తొలుచు పురుగు నివారణ కోసం స్పైనోసాడ్ 60ఎంఎల్ ఎకరాకు పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది అని తెలిపారు. అలాగే చిగిచర్ల ఓబిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి ఆముదం,వేరుశనగ వరి పంట పొలాలు పరిశీలించడం జరిగింది అని, అక్కడ కూడా అముదం పంటలో బూజు తెగులు నివారణకు ప్రోపికోనజోల్ 1ఎంఎల్ లీటరుకు పిచికారి చేయవలసిందిగా సూచించడం జరిగింది అని తెలిపారు. వరి పంటలో దోమపోటు నివారణకు పెక్సీలాన్ 94ఎంఎల్ ఎకరాకు పిచికారి చేయవలసిందిగా సూచించడం జరిగిందన్నారు. రబిలో సాగు చేసిన వేరుశనగ పంట మొదటి దశలో వేప నూనె ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. తదుపరి పూత దశలో ఎకరాకు 200 కిలోలు జిప్సం వేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి ముస్తఫా ,వి హెచ్ ఏ భార్గవ్, డి ఆర్ సి
ఏ. ఓ. అబ్దుల్ అలీ ,లక్ష్మీనారాయణ ఏఈఓ గ్రామ రైతులు పాల్గొన్నారు. (Story : చిగిచెర్ల గ్రామంలో పొలాల పరిశీలన )