ఒప్పంద ప్రాతిపదికన బోధన సిబ్బంది పోస్టుల భర్తీ
– ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్
న్యూస్ తెలుగు/కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన గౌరవ వేతనం పద్ధతిలో బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. 21 విభాగాలలో 6 ప్రొఫెసర్, 20 అసోసియేట్ ప్రొఫెసర్, 20 అసిస్టెంట్ ప్రొఫెసర్, 52 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని, ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు జరుగుతుందని, వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిన అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరుకావాలని తెలిపారు. విద్యార్హత, కులం, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఒరిజినల్స్, ఒక జత నకలు ప్రతులతో హాజరు కావాలని, అభ్యర్థులు నవంబర్ 1, 2024 నాటికి 69 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలని, పోస్టుల ఖాళీలు, విద్యార్హత వివరాల కొరకు కళాశాల వెబ్ సైట్ http://gmckumrambheemasifabad.org లో సంప్రదించవచ్చని తెలిపారు.(Story:ఒప్పంద ప్రాతిపదికన బోధన సిబ్బంది పోస్టుల భర్తీ )