సౌత్ ఇండియా కబడ్డీ పోటీలకు కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బి శ్రీనివాసులు అనే బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎంపిక కావడం జరిగిందని ప్రిన్సిపాల్ కే.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 19, 20వ తేదీలలో ఎస్కే యూనివర్సిటీ నిర్వహించినటువంటి సెలెక్షన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన ఈ విద్యార్థి తమిళనాడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 31వ తేదీ నుండి ప్రారంభమయ్యే సౌత్ ఇండియా కబడ్డీ పోటీలకు ఎస్కే యూనివర్సిటీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు వారు తెలిపారు. మా కళాశాలలో విద్య తో పాటు అన్ని రకాల క్రీడలకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థి శ్రీనివాసులు కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు ఫిజికల్ డైరెక్టర్ ఆనందు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : సౌత్ ఇండియా కబడ్డీ పోటీలకు కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక)