ధర్మవరం చెరువును పరిశీలించిన జనసేన పార్టీ చిలుకమ్ మధుసూదన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : నియోజకవర్గంలో గత రెండు రోజులుగా రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నియోజకవర్గంలోని పలు మండలాలతో పాటు అనేక గ్రామాలు కూడా తీవ్రంగా నడిచిపోయాయి. సమాచారం అందుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి వర్షపాతం, వల్ల నష్టపోయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి పట్టణంలోని ధర్మారం చెరువుకు చేరుకొని అక్కడ పరిశీలించి చెరువు పూర్తిగా నిండడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చెరువు పూర్తిగా నిండడం వల్ల కట్ట తెగితే ఊరికే ప్రమాదం వస్తుందని, తెగకుండా నీటిని పక్కకు మళ్ళించే విధంగా మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించారు. తీవ్ర వర్షపాతం వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఎన్డీఏ ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రేగాటిపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. (Story : ధర్మవరం చెరువును పరిశీలించిన జనసేన పార్టీ చిలుకమ్ మధుసూదన్ రెడ్డి)