ప్రతి మొక్కకు ఎరువు తప్పనిసరి..
ఎంపీడీవో అబ్దుల్ నబీ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రతి మొక్కకు ఎరువు తప్పనిసరి అని ఎంపీడీవో అబ్దుల్ నబీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని మల్లా కాలువ గ్రామంలో గల రవీంద్రారెడ్డి పొలం నందు గుంతలు తవ్వి, మామిడి మొక్కలను నాటడం జరిగింది. తదుపరి వారు మాట్లాడుతూ మంచి మొక్కలను ఎంపిక చేసుకొని త్రవ్విన గుంతలలో ఎరువులు వేసి నింపితే మొక్కలు త్వరగా పెంపకం జరుగుతుందని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వము నుండి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రోత్సాహం కూడా లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి, టిఏ చంద్రకళ, సీనియర్ మేట్ రవి, గ్రామ రైతులు కూలీలు పాల్గొన్నారు. (Story : ప్రతి మొక్కకు ఎరువు తప్పనిసరి.. )