UA-35385725-1 UA-35385725-1

ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు

ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు వన్ టౌన్ పోలీస్ సిఐ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా పోలీస్ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల యొక్క త్యాగాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, పోలీసులు నిర్వహించే విధులు, వంటి వాటిపై సి ఐ నాగేంద్రప్రసాద్ విద్యార్థులకు అవగాహన అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ భౌగోళిక మ్యాప్, వైర్లెస్ సెట్, కేసు డైరీలు తదితర వంటి వాటిపై అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్థుల నడవడిక విద్యార్థి దశలో విద్యార్థులు ఏ విధంగా ఉండాలి , చెడు వైపు వెళ్లకుండా బాగా చదువుకొని మంచి మార్గంలో వెళ్లడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయని విద్యార్థులకు తెలియజేశారు.వారం రోజులు పాటు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు జిల్లావ్యాప్తంగా జరుగునున్నాయి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.(Story:ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1