వనపర్తిలో ఈ నెల 29న రైతులతో భారీ నిరసన సదస్సు : నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి: వనపర్తిలో ఈ నెల 29న రైతులతో భారీ నిరసన సదస్సు చేపడుతున్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.మంగళవారం వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సదస్సుకు ముఖ్య అతిథిగా హరీశ్ రావు హాజరవుతారన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయకుండా రైతులను అరిగోస పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, బాధ్యతగల ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడాలని బీఆర్‌ఎస్‌కు శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ రైతు సదస్సులో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రతి మహిళకు రూ.2500, యువతులకు స్కూటీలు,కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, 4వేల ఆసరా ఫించన్లు, నిరుద్యోగ భృతి, కె.సి.ఆర్ కిట్టు, తదితర హామీలు ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించి అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేటట్లు చేయాలని పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వ మోసపూరిత చర్యలపై సమరభేరి మోగిస్తామని సదస్సులో బీఆర్‌ఎస్ నాయకులు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ బి.లక్ష్మయ్య,పెండం.కురుమూర్తి యాదవ్,పి.రమేష్ గౌడ్,గంధం.పరంజ్యోతి, నందిమల్ల.అశోక్,మండల పార్టీ అధ్యక్షులు రఘురామ రావు,మాణిక్యం,వనం,రాములు,వేణు,బి.బాలరాజు,రాళ్ళ.కృష్ణయ్య,
మాజీ ప్రజాప్రతినిధులు కృష్ణా నాయక్, లక్ష్యమా రెడ్డి,రఘుపతి రెడ్డి,సామ్యా నాయక్,పెద్దింటి.వెంకటేష్,జగన్నాథం నాయుడు,చంద్రశేఖర్ నాయక్,జాతృణాయక్,నాగన్న యాదవ్,బండారు.కృష్ణ,కంచ.రవి,ప్రేమ్ నాథ్ రెడ్డి, ఉంగ్లమ్. తిరుమల్,స్టార్.రహీమ్,గులాం ఖాదర్ ఖాన్, జోహబ్ హుస్సేన్, సూర్య వంశపు.గిరి,చిట్యాల.రాము,తదితరులు పాల్గొన్నారు.(Story:వనపర్తిలో ఈ నెల 29న రైతులతో భారీ నిరసన సదస్సు : నిరంజన్ రెడ్డి)