పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు /వనపర్తి : దసరా పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు తరలివచ్చి నిండు మనసుతో ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన గృహప్రవేశం చేసిన ఎల్. ఐ.సి ఎజంటు ఎం.జ్యోతి నాగరాజు గార్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నందిని హోటల్ యజమాని లింగాల.లతామునిశ్వర్ గార్ల మనవరాలు ధృతీ మొదటి పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చిన్నారిని ఆశీర్వదించారు. నాయిబ్రాహ్మణ నాయకులు అశ్వని.ఉమామహేశ్వరి రమేష్ కూతురు భువనేశ్వరి అజిత్ నిశ్చితార్థ వేడుకలలో పాల్గొని కాబోయే వధూ వరులను ఆశీర్వదించారు. బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కృష్ణా నాయక్ కుమారుడు శంకర్ నాయక్ ఇటీవల కె.సి.ఆర్ హయాములో ఇరిగేషన్ ఎ.ఈ గా ఉద్యోగం సాధించినందుకు శంకర్ నాయక్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవ్యప్తంగా నిరంజన్ రెడ్డి అభిమానులు శ్రేయోభిలాషులు బి.ఆర్.ఎస్ నాయకులు కార్యకర్తలు దసరా పండుగ సందర్భంగా జమ్మి సమర్పించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్, పి.రమేష్ గౌడ్,పి.కురుమూర్తి యాదవ్,మాజీ మార్కెట్ ఛైర్మెన్ లక్ష్మరెడ్డి,రాళ్ళ.కృష్ణయ్య, నందిమల్ల.అశోక్,మాణిక్యం, ధర్మా నాయక్,గులాం ఖాదర్ ఖాన్, నీల స్వామి, జోహేబ్ హుస్సేన్, నాగవరం వెంకటయ్య, స్టార్ రహీమ్, యుగంధర్ రెడ్డి, వజ్రాల రమేష్, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story : పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి)