సాలూరు ప్రాణదాత ట్రస్ట్ సీఎం సహాయ నిధి కి లక్ష రూపాయల చెక్కు అందచేత
న్యూస్ తెలుగు/ సాలూరు : విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్య మంత్రి సహాయ నిధి కి సాలూరు ప్రాణదాత ట్రస్ట్ నుంచి లక్ష రూపాయలు చెక్కును రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి వర్యులు శ్రీ గుమ్మిడి సంధ్యా రాణి కి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో Dr . V . గణేశ్వరా రావు గారు , ఇందుపూరి నారాయణరావు, గంటా వెంకటరాజు,ఉప్పల వెంకటేశ్వరావు ,వడ్డాది షణ్ముఖ ముత్యాలు , వానపల్లి ఈశ్వర రావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు తెలుగుదేశం పార్టీ నాయకులు పుసర్ల నరసింహారావు పాల్గొనడం జరిగింది. (Story : సాలూరు ప్రాణదాత ట్రస్ట్ సీఎం సహాయ నిధి కి లక్ష రూపాయల చెక్కు అందచేత)