చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయకూడదు
సంఘ విద్రోహ శక్తులకు సహకరించకూడదు
గ్రామాలలో శాంతియుత వాతావరణంలో ఐక్యతగా దసరా ఉత్సవాలు జరుపుకోవాలి
ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్
ఎస్సై .ఎస్కే తాజుద్దీన్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) :చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరూ కూడా చేయకూడవద్దని, సంఘ విద్రోహ శక్తులకు ఎవరూ సహకరించకూడ వద్దనీగ్రామాలలోకి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లయితే తమకు సమాచారం అందించాలని గ్రామాలలో
శాంతియుత వాతావరణంలో ఐక్యతగా అందరూ కలిసి మెలిసి దసరా ఉత్సవాలు జరుపుకోవాలిని
ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై .ఎస్కే తాజుద్దీన్.లు సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం మాజీ నక్సలైట్లు సాంభూతిపరులకు. కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం వారు ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారు వారి యొక్క జీవన ఆధారం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామాలలో ఎవరిని బెదిరింపులకు గురి చేయవద్దఅన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే, చూస్తూ ఊరుకునేది లేదని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయకూడదు)