శాంతి రథం సిద్ధం
* వైకుంఠయాత్రకు ఉచిత రథం రెడీ
* మానవతా సేవలు అద్వితీయం
* పార్థివ దేహం రవాణాకు వాహనం ఉచితం
న్యూస్‌తెలుగు/తిరుపతి ఆగస్టు 29: మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన శాంతిరథాన్ని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు ప్రముఖ సామాజికవేత్త సైకం జయ చంద్ర రెడ్డి తుడా ఈ ఈ ఎన్ వి కృష్ణారెడ్డి చేతుల మీదుగా గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో ఎవరైనా మరణిస్తే వారి పార్తివ దేహాన్ని వారి స్వస్థలానికి లేదా స్మశాన వాటికకు తీసుకు వెళ్లేందుకు ఉచితంగా వాహన సౌకర్యాన్ని శాంతిరథం పేరిట మానవతా సంస్థచే ప్రారంభించడం అభినందనీయమన్నారు. అవసరమైన వారికి ఉచితంగా బాడీ ఫ్రీజర్లను అందించడంతోపాటు రవాణా సౌకర్యార్థం ఉచితంగా శాంతి రథాన్ని కూడా ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు మానవతా సంస్థచే పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మొక్కల పెంపకం ఉచిత వైద్య శిబిరాలు శాంతి ర్యాలీలు ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందించడంతోపాటు మానవతా సభ్యులు అండదండలు అందించి చేయూతగా ఉండడం గొప్ప విషయం అన్నారు ఈ సందర్భంగా మానవతా అధ్యక్ష కార్యదర్శులు సివి రమణ సుకుమార్ రాజులు మాట్లాడుతూ నగర పరిధిలోని 10 కిలోమీటర్ల వరకు శాంతి రథాన్ని ఉచితంగా అందిస్తారని 10 కిలోమీటర్లు పైబడితే కేవలం ఇంధనం ఇస్తే వాహనాన్ని పంపడం జరుగుతుందన్నారు వివరాల కోసం సెల్ నంబర్లు 9441449525 6281433397 లను సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో వీరితోపాటు మానవతా సభ్యులు భార్గవ్ వేణుగోపాల్ గంగిరెడ్డి భాస్కర్ రెడ్డి కిరణ్ రెడ్డి శేఖర్ రెడ్డి గౌతమ్