కూటమి కక్ష సాదింపు చర్యలు మానుకోవాలి
ప్రోటోకాల్ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు
న్యూస్ తెలుగు/విజయవాడ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి పక్షాల పట్ల కక్ష సాదింపు చర్యలు మానుకోవాలని పలువురు వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. దుర్గగుడి కొండపైకి వెళ్లేందుకు నగర మేయర్‌కు అనుమతివ్వకుండా అవమాన పర్చిన సంఘటనను స్థానిక వీఎంసీ కార్యాలయంలోని వైసీపీ ప్లోర్ లీడర్ చాంబర్‌లో ఆ పార్టీ కార్పొరేటర్లు మంగళవారం నిర్వహించిన విలేఖర్లు సమావేశంలో ఖండిరచారు. ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్ సుబ్బారావు మాట్లాడుతూ నగర ప్రధమ పౌరురాలైన నగర మేయర్ భాగ్యలక్ష్మి కనకదుర్గమ్మ గుడిలో జరుగుతున్న దసరా ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్లగా సిబ్బంది ప్రోటోకాల్ పాటించకుండా అడ్డుకుని అవమానిస్తూ కక్షసాదింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కేసు విషయంలో ముంబైకి చెందిన సినీ యాక్టర్‌కు ఇచ్చిన గౌరవం, ఆమెకు కల్పించిన రక్షణ నగర మేయర్‌కు ఇవ్వకపోవటాన్ని తప్పుపట్టారు. మేయర్‌ను అగౌరవపర్చటం సరైందికాదని దీనిపై చర్యలు తీసుకోవటంతో పాటు టీడీపీ, జనసేన పార్టీ అదినాయకులు సమాదానం చెప్పాలని కోరారు. నగరాన్ని అస్థిరపర్చి పార్టీని చీల్చి కక్ష సాదించాలనే ప్రయత్నాలను టీడీపీ మానుకుని మేయర్‌కు బేషరతుగా క్షమాపణ పాల్పని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రజాస్వామ్య వెతిరేక చర్యలను ప్రతి ఒక్కరూ ఖండిరచాలన్నారు. అధికార కూటమి విపక్షాల పట్ల కక్షసాదింపు చర్యలకు పాల్పడితే వైసీపీ ప్రజా కోర్టుకు వెళ్లి పోరాటాలు నిర్వహిస్తామని, ఏమాత్రం ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. కార్పొరేటర్ అంబేద్కర్ మాట్లాడుతూ దసరా మహోత్సవాల్లో అధికారులు, పోలీసులు ప్రొటోకాల్ పాటించలేదన్నారు. రాష్ట్రంలో 2వ పెద్ద నగరమైన విజయవాడ నగర మేయర్‌ను అవమానించటంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని తప్పుపట్టారు. మరోసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని సూచించారు. కార్పొరేటర్ చైతన్యరెడ్డి మాట్లాడుతూ పార్టీలతో సంబందం లేకుండా నగర అభివృద్దికి పాటు పడుతున్న నగర ప్రధమ పౌరురాలైన మేయర్‌కు దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ప్రాధాన్యత నివ్వకపోవటంతో పాటు అవమానించటం సోచనీయమన్నారు. కక్ష సాదింపు కోసం విపక్షాలను తద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలు కూటమి ప్రభుత్వం మానుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రొటోకాల్ పాటించటం నైతిక బాద్యతన్నారు. నగరంలో వైసీపీ ప్రాధాన్యతను తగ్గించాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. నగర మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు మాట్లాడుతూ మేయర్ స్థానాన్ని అగౌరవ పర్చే సంసృతిని కూటమి ప్రభుత్వం మానుకోవాలన్నారు. దసరా ఉత్సవాలకు వీఎంసీ నుంచి ఖర్చు చేయటంతో పాటు ఉత్సవాలు విజయవంతం కోసం పాలక వర్గం కృషి చేస్తోంటే నగర మేయర్‌ను ప్రతిపక్షంగా చూస్తూ తగిన ప్రాధాన్యత నివ్వకుండా అవమానించటం విపక్షాల పట్ల కక్షసాదింపు చర్యలు కావాలని ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జరిగే పోరాటానికి కూటమి ప్రభుత్వానిదే బాద్యతని హెచ్చరించారు. విలేఖర్లు సమావేశంలో కార్పొరేటర్లు తాటిపర్తి కొండారెడ్డి, విజయలక్ష్మి, తిరుపతమ్మ, చలపతిరావు పాల్గొన్నారు. (Story : కూటమి కక్ష సాదింపు చర్యలు మానుకోవాలి)