రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రి కూతురు
నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పి ఈ టిగా పనిచేస్తున్న రమేష్ పెనుకొండలో నివాసం ఉంటూ తనకున్న ఇద్దరు కూతుర్లను శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివిస్తున్నాడు. పెద్ద కూతురు సాయి భవిత హాకీ పోటీలలో 3,4,5 తేదీలలో నెల్లూరు జిల్లాలో పాల్గొని జాతీయస్థాయికి ఎంపిక కావడంతో వారు 6వ తేదీ ధర్మవరం వచ్చారు. అక్కడ నుండి పెనుకొండ కు వస్తుండగా గుట్టురు కనుమ వద్ద వెనకనుంచి బొలెరో వాహనం ఢీకొట్టగా ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గుట్టురు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం పెను కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అప్పటికే సాయి భవిత మరణించినట్లు డాక్టర్లు దృవీకరించారు. తీవ్రంగా గాయపడిన రమేష్ ను మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం తెలుసుకున్న పెనుకొండ ఎమ్మెల్యే, మంత్రి సవిత ధర్మవరం లోని వారి ఇంటి దగ్గర కు వెళ్లి భౌతిక కాయనికి పూలమాల వేసి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. మంత్రి సవిత మాట్లాడుతూ ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని, తండ్రి కూతుర్లకు ఆత్మశాంతి కలగాలని, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రి కూతురు)