రెవెన్యూ డివిజన్ ప్రజల సమస్యల పరిష్కరించే దిశగా విధులను నిర్వర్తించాలి
ఆర్డిఓ-ఏ. మహేష్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రెవెన్యూ డివిజన్ ప్రజల సమస్యలను పూర్తి దశలో పరిష్కరించేలా తమ విధులను నిర్వర్తించాలని ఆర్డీవో ఏ. మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ధర్మవరం, ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా ప్రభుత్వ విభాగాల శాఖల అధికారులు యొక్క ప్రగతి పూర్తి దశలో ఉండేలా కృషి చేయాలని ఆర్డీవో సూచించారు. అనంతరం ఆర్డిఓ వివిధ ప్రభుత్వ విభాగాల శాఖల అధికారులతో వారు మాట్లాడుతూ సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలపై తగు సూచనలు సలహాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రతి విభాగంలోనూ సమయపాలన విధిగా ఉండాలని, ప్రతి సోమవారం వచ్చే గ్రీవెన్స్ లో సకాలంలో పరిష్కరించే దిశలో ఉండాలని, ఆయా మండల ఎమ్మార్వో కార్యాలయాల్లో వచ్చే ప్రజల సమస్యలు సాధ్యమైనంతవరకు అక్కడ పరిష్కరించే దిశలో ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిగా నియమ, నిబంధనలను పాటిస్తూ, ప్రజలందరికీ సకాలంలో పరిష్కారమయ్యేలా తమ తమ విధులను నిర్వర్తించినప్పుడే కార్యాలయమునకు ప్రభుత్వానికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయము నుంచి వచ్చే గ్రీవెన్స్ లో ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కడ కూడా సమస్యలు లేని విధంగా అధికారులు మంచి పట్టు పట్టాలని తెలిపారు. విద్య, వైద్య విషయాలలో మంచి పట్టు ఉండేలా చూస్తూ, కార్యాలయంలో అన్ని సెక్షన్లలో పనులు అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయా విభాగాల అధికారుల దేనిని వారు స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యము, అశ్రద్ధ అనే వాటికి తావు ఇవ్వరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఏ ఓ కతిజున్ కుప్రా, డిప్యూటీ ఎమ్మార్వో అండ్ ఏఎస్ఓ లక్ష్మీదేవి, డిప్యూటీ ఎమ్మార్వో అంపయ్య, ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి :
విధుల పట్ల ప్రతి ఉద్యోగి అప్రమత్తంగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశలో విధులను బాధ్యతగా నిర్వర్తించాలని ఆర్డీవో ఏ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయములోని అధికారులు సిబ్బందితో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కార్యాలయములోని ఆయా విభాగములలోని పనితీరుపై వారు ఆరా తీశారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఉద్యోగులుగా బాధ్యత నిర్వర్తిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అందరూ ఉండాలని తెలిపారు. డెత్, బర్తు సర్టిఫికెట్ పంపిణీ విషయంపై ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించిన సమాచారాన్ని అత్యవసరంగా భావించి కోర్టును గౌరవిస్తూ, ఆ సమాచారాన్ని పంపాలని తెలిపారు. గ్రీవెన్స్ ఎల్లో వచ్చే ప్రజల సమస్యలను తూతూమంత్రంగా, నామమాత్రంగా కాకుండా పూర్తి దిశలో పరిష్కారం కావాలని తెలిపారు. ప్రజలలో, రైతులలో మంచి నమ్మకం ఉండేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కతి జూన్ కుప్రా, లక్ష్మీదేవి, అంపయ్య, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. (Story :రెవెన్యూ డివిజన్ ప్రజల సమస్యల పరిష్కరించే దిశగా విధులను నిర్వర్తించాలి)