ప్రభుత్వ చౌక ధాన్యం దుకాణాలు ప్రారంభించిన చిలకం మధుసూదన్ రెడ్డి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ఏడవ వాడు శివానగర్ లోని పేరూరు శ్రీనివాసులు, 36వ వార్డు కొత్తపేటలోని చంద్రశేఖర్, 37వ వార్డు మారుతీ నగర్ లోని బెస్త శ్రీనివాసులు, 23వ వార్డు సాయి నగర్ లోని యాదిండి వెంకటేష్, 30 వ వార్డు దుర్గా నగర్ లోని తలారి ప్రతాప్ వీరందరికీ ప్రభుత్వ చవుక దుకాణములు అనుమతి కావడంతో, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి చౌక దుకాణాలకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులకు అన్ని రకాలుగా ప్రభుత్వం సరఫరా చేసిన సరుకులు ఎటువంటి అవకతవకలు ఉండకుండా పంపిణీ చేయాలని, దీంతో ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చేలా కృషి చేయాలని తెలిపారు. తదుపరి ప్రభుత్వ చౌక దుకాణదారులు చిలకమ్మకు కృతజ్ఞతలను తెలియజేశారు. తదుపరి కొత్తపేట నందు వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లను వారు అందజేశారు. లబ్ధిదారులతో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు అందజేస్తున్నమని తెలిపారు. సరిగ్గా ప్రతినెలా ఒకటవ తేదీన పెన్షన్ అందజేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. (Story : ప్రభుత్వ చౌక ధాన్యం దుకాణాలు ప్రారంభించిన చిలకం మధుసూదన్ రెడ్డి)