ఘనంగా ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణంలో ఘనంగా ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ దత్త హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్యులు గార్లపాటి కృష్ణ కాంత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 2 కే వాక్ కు విశేష స్పందన లభించింది. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో కాలి నడకలో పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం వద్ద నుండి ప్రారంభమైన నడక కార్యక్రమం స్తూపం సెంటర్, ఏనుగుపాలెం రోడ్డు మీదుగా శ్రీ దత్త హాస్పిటల్ వరకూ కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభ కార్యక్రమంలో పలువురు వైద్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
అనంతరం శ్రీ దత్త హాస్పిటల్ యాజమాన్యం వారు శారదాంబ సమావేశ మందిరంలో గుండె ఆరోగ్యంపై అవగాహన సదస్సు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతిరోజూ నడక, శారీరక శ్రమ గుండెకు ఆరోగ్యమని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మద్యపానం, ధూమపానం వలన గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందని వైద్యులు తెలిపారు.
మానసిక ఒత్తిడి తగ్గించుకునేలా జీవన అలవాట్లు మార్చుకోవాలని, ప్రతిరోజూ యోగ, ధ్యానం వంటివి చేయటం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా గుండె యొక్క పనితీరు దాని లక్షణాలు నివారణ చర్యలు గూర్చి డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ మరియు డాక్టర్ గార్లపాటి జ్ఞానేశ్వరి ఎంతో చక్కగా వివరించారు. ఈ అవగాహన సదస్సుకు సుమారు ఒక వెయ్యి మంది అటెండ్ అయ్యి, వారి సందేహాలను నివృత్తి చేసుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ పూర్ణిమ , కిడ్నీ మరియు మూత్ర సంబంధిత శస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ అన్న మణికంఠ సురేష్ , వినుకొండ ఐఎంఏ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ ఎల్ ఎన్ రావు , డాక్టర్ ఆనంద్ కుమార్ , మరియు వినుకొండ పట్టణంలో పీడియాట్రిక్ విభాగానికి సంబంధించిన డాక్టర్ ప్రసన్న, ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. (Story : ఘనంగా ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు )