ఎముకుల సంబంధిత వ్యాధులపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి
ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రఫిక్
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రోజురోజుకు పెరుగుతున్న ఎముకల సంబంధిత వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకొని సకాలంలో వైద్యం చేయించుకుంటే ఎముకల సంబంధించిన వ్యాధులు పూర్తిగా నయమవుతాయని బెంగళూరు సాగర్ హాస్పిటల్ కి చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ రఫిక్ తెలిపారు. పట్టణంలోని అరిగల పోతన్న హాస్పిటల్ లో జనరల్ సర్జన్ డాక్టర్ గణేష్ ఆధ్వర్యంలో సాగర్ హాస్పిటల్ సంయుక్తంగా ఎముకల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ రఫిక్ మాట్లాడుతూ రోజురోజుకు మనం తీసుకునే ఆహారంలో కల్తీలవల్ల , ఎముకలలో పట్టుత్వం లేక త్వరగా ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని, ప్రమాదాలు జరిగిన వెంటనే గుర్తింపు కలిగిన ఆర్థోపెడిక్ వైద్యుల వద్ద చికిత్స చేయించుకోవాలని కొంతమంది అవగాహన లేక నాటు వైద్యం ద్వారా ఎముకలకు చికిత్స చేయించుకోవడం వల్ల తిరిగి సంబంధిత వ్యాధి పునరావృతమాయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు. అనంతరం సుమారు నూరు మందికి ఉచిత వైద్య శిబిరం ద్వారా పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలతో పాటు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాగర్ హాస్పిటల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మునీంద్ర, అరిగల పోతన్న హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : ఎముకుల సంబంధిత వ్యాధులపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి)