చేనేత కార్మిక పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాను జయప్రదం చేయండి
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం మండల పరిధిలోని వేల్పుమడుగు క్రాస్ వద్ద ఉన్న జే ఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ దగ్గర గురువారం ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్నాకు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలోని గీతా నగర్ లో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం చేనేత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, అధ్యక్షులు మాదవస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘం, ఏఐటీయూ అనుబంధం, సిఐటియు అనుబంధ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు పాల్గొంటారని తెలిపారు. ఈ ధర్నా యొక్క ఉద్దేశం మన పరిశ్రమలు కాపాడడానికి, మన చేనేత కార్మికులు ఆకలి చావులు, ఆత్మహత్యలు నివారించడానికి జరిగేటటువంటి ఈ ధర్నాలో ప్రతి ఒక్క చేనేత కార్మికుడు పాల్గొని, విజయవంతం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి బాలాజీ, జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, సిహెచ్. భాష, జీవి రమణ, మోహన్, చేనేత పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వెంకటస్వామి, ఆదినారాయణ, రవికుమార్, రమణ, వెంకటస్వామి, ఆదినారాయణ, ఖాదర్ బాషా, శ్రీధర్, శ్రీనివాసులు, కొండ , అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. (Story : చేనేత కార్మిక పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాను జయప్రదం చేయండి)