నగర అందాన్ని పెంచేందుకు కెనాల్ బండ్ బ్యూటిఫికేషన్
నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : నగర అందాన్ని మరింత పెంచేందుకు కెనాల్ బండ్‌ల వద్ద గ్రీనరీతో బ్యూటిఫికేషన్ చేయడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఎస్టీపీల్లో అప్ర్‌గ్రేడేషన్ పనులు చేట్టి త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా కమిషనర్ మంగళవారం రామలింగేశ్వర నగర్, సింగ్‌నగర్, జక్కంపూడి కాలనీ ఎస్‌టీపీ, బందర్ కెనాల్ బండ్, పీసీఆర్ జంక్షన్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగర పరిధిలో జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా యూనిడో ప్రాజెక్ట్ ద్వారా సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మరింత అభివృద్ధి చేస్తూ కాలుష్యాన్ని తగ్గించే విధంగా నగరపాలక సంస్థ ముందుడుగు వేస్తుందన్నారు. నగరంలో ఏడు ఎస్టీపీలు ఉన్నప్పటికీ, నూతనంగా మరో ఎస్టీపీను ఆటోనగర్ వద్ద నిర్మించబోతున్నట్లు తెలిపారు. నగర పరిధిలో ప్రజల నుండి వస్తున్న వాడుక నీటిలో కాలుష్యాన్ని మరింత తగ్గించే విధంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే రామలింగేశ్వర నగర్, సింగ్‌నగర్, జక్కంపూడి, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో అడిషనల్ ఏరీయేషన్ ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. బందర్ కెనాల్, ఏలూరు కెనాల్‌లో ఉన్న కెనాల్ బండ్లను పచ్చదనంతో, మొక్కలతో నింపటమే కాకుండా వాకింగ్ ట్రాక్, ప్లే ఎక్వీప్‌మెంట్, జిమ్‌తో మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పేలా ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ పర్యటనలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కేవీ.సత్యవతి, ఎస్‌ఈ రామ్మోహన్రావు, ఈఈలు ఏఎస్‌ఎన్.ప్రసాద్, వీ.శ్రీనివాస్ పాల్గొన్నారు. (Story : నగర అందాన్ని పెంచేందుకు కెనాల్ బండ్ బ్యూటిఫికేషన్)